Tuesday, 10 November 2015






Thursday, 29 October 2015










  ఎన్టీఆర్‌తో శ్రీదేవి కూతురు జాహ్నవి..?



త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాహ్నవి ఎంట్రీ ఇవ్వనుందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‑గా మారింది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న 'జనతా గ్యారేజ్'  చిత్రంతో  జాహ్నవిని హీరోయిన్గా పరిచయం చేయాలని భావిస్తున్నారట. ఈ విషయంపై ఇప్పటికే శ్రీదేవిని సంప్రదించారని  కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పుడైనా  అతిలోక సుందరి వారసురాలి ఎంట్రీ నిజమో లేక మరోసారి గాసిప్ అంటూ కొట్టి పారేస్తారో చూడాలి .


 మారుతికి జాగ్వార్ కారుని బహుమతిగా ఇచ్చిన వంశీ




మారుతికి వంశీ ఖరీదైనా కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. 'భలే భలే మగాడివోయ్' ఘన విజయాన్ని సందర్భంగా మారుతికి జాగ్వార్ కారుని బహుమతిగా ఇచ్చారు వంశీ . సెకండ్ హ్యాండ్ సైకిల్ తో ఆరంభమైన తన జీవితం ఇప్పుడు జాగ్వార్ కారు వరకూ వచ్చిందని మారుతి పేర్కొన్నాడు. తనకు బహుమతి ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు  మారుతి.
నాగ్ తో వెంకి మల్టీ స్టారర్ మూవీ 



తెలుగులో మల్టీస్టారర్ చిత్రాల హవా కొనసాగుతుంది. ఈ ట్రెండ్ ఆరంభమైంది విక్టరి వెంకటేశ్ కారణంగానే. ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', రామ్ తో కలిసి 'మసాలా', పవన్ కల్యాణ్ తో కలిసి 'గోపాల గోపాల' చిత్రాల్లో నటించాడు వెంకి . తాజాగా మరో మల్టీస్టారర్ కి వెంకటేష్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  నాగార్జున కాంబినేషన్లో వెంకి  ఓ చిత్రంలో కలిసి నటిస్తాడనే  వార్త ఫిల్మ్ నగర్ లో గుస గుస .  అఖిల్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమాకి దర్శకత్వం వహిస్తున్న వి.వి. వినాయక్ ఓ మంచి కమర్షియల్ స్టోరీ రెడీ చేశాడట. ఈ కథలో వెంకటేష్, నాగర్జున కలిసి నటిస్తే బాగుంటుందని దానికి సంబందించిన కథ వెంకీ, నాగ్ లకు ఈ చెప్పాడట వినాయక్. ఇద్దరికీ ఈ కథ నచ్చిందని దాంతో ఈ సినిమాలో  నటించడానికి వెంకీ, నాగ్ లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.


Tuesday, 15 September 2015






Saturday, 12 September 2015











Friday, 11 September 2015